టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ “గంభీర్” గురించి పెద్దగా పరిచయ చేయనవసరం లేదు దేశ భక్తిని  ఎప్పటికప్పుడు చాటి చెప్తూ...సామజిక కార్యక్రమాలలో , పాల్గొంటూ భారత దేశం పై ఈగ వాలినా సరే ఒప్పుకొని గొప్ప భారతీయుడిగా ఒక గొప్ప క్రికెటర్ గా అందరికి తెలిసిన వ్యక్తే..అంతేకాదు ముక్కు మీద కోపం కలిగిన వ్యక్తి కూడా అయితే ఇప్పుడు గంభీర్ బీసీసీఐ పై విరుచుకు పడ్డాడు..

 Image result for gautam gambhir

వన్డే, టీ20ల మోజులో పడి.. టెస్టు క్రికెట్‌‌ ఆదరణని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పట్టించుకోవడం లేదని వెటరన్ ఓపెనర్ విమర్శించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌‌కి కల్పిస్తున్న ప్రచారంలో కొంచెం కూడా టెస్టు‌లకి కల్పించలేదని..ఈ పరిణామాలతో క్రమ క్రమంగా అభిమానులు టెస్టు లని మర్చోపోయే పరిస్థితికి వచ్చిందని దీనికి కారణం బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలే అంటూ విమర్శించాడు.

 Image result for gautam gambhir

తాజాగా బీసీసీఐ పాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్ రాయ్, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీని కలిసిన గంభీర్.. టెస్టు క్రికెట్ మనుగడని కాపాడాలని విన్నవించాడు. 2011లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా...వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టేడియంలో వెయ్యి మంది మాత్రమే అభిమానులున్నారని గుర్తు చేశాడు..అంతేకాదు

 Image result for bcci

వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతుంటే.. కేవలం 1000 మంది మాత్రమే అభిమానులు స్టేడియంలో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించమని చెప్పాడు..అయితే ఈ పరిస్థితికి కారణాలు ఏమిటనేది నాకు తెలియదు కానీ ఒకవేళ టీ20, వన్డేల సంఖ్యని తగ్గిస్తే మళ్లీ టెస్టులకి పూర్వ వైభవం వస్తుందేమో అనే ఆశాభావం గంభీర్ వ్యక్తపరిచాడు...


మరింత సమాచారం తెలుసుకోండి: