రోహిత్ శర్మ తన అత్యున్నతమైన ప్రతిభతో ఎన్నో విజయాలు భారత జట్టుకి అందించిన టీం క్రికెటర్ గా ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడిగా అందరికీ తెలిసిన వ్యక్తే..అతడి క్రికెట్ జీవితంలో వన్డే మ్యాచ్ లలో అతడు లేని జట్టుని ఊహించుకోలేము అయితే రోహిత్ టెస్టు జట్టుకి మాత్రం లేకుండా ఉండటం ఎన్నో సార్లు చూసే ఉంటాం..అయితే తాజా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు తనని ఎంపిక చేయకుండా సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు..

Image result for rohit sharma press meet

జట్టులో నేను ఎంపిక కాకపోవడం నాకు భాద కలిగించే అంశం కాదని తెలిపాడు..అయితే ఈ సంవత్సరం మొదట్లోనే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో రోహిత్ ఫెయిల్ అయ్యాడు..దాంతో సెలక్టర్లు బెంగుళూరు వేదికగా జరుగుతున్నా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టెస్టు మ్యాచ్ కి పక్కన పెట్టేశారు...అయితే ఈ విషయంపై రోహిత్ చాలా పాజిటివ్ గా స్పందించాడు...సోమవారం ముంబైలో జరిగిన సియెట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ  మాట్లాడుతూ 

Image result for rohit-sharma-not-fussed-over-losing-his-place-the-test-squad

క్రికెటర్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇప్పటికే సగం కెరీర్‌ పూర్తి చేసేశాను. ఇప్పుడు కూడా నేను భారత జట్టులోకి ఎంపికవుతానా? తుది జట్టులో ఉంటానా? అని ఆలోచించడం భావ్యం కాదని తెలిపాడు..ఆ రకమైన భయం కెరియర్ మొదట్లో ఉండేదని అయితే ఇప్పుడు కేవలం ఆటని ఆస్వాదించడం మేరకే  ఉందని అన్నారు...నా వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అని చెప్పాడు...అయితే దేనికైనా టైం రావాలని అన్నాడు   


మరింత సమాచారం తెలుసుకోండి: