భారత జట్టుకు స్పిన్ మాంత్రికులుగా పేరు ఉన్న అనిల్ కుంబ్లే ,బజ్జీ వంటి వారు దూరం అయిన సమయంలో భారత జట్టుకు అంతటి ప్రతిభ కలవారు మళ్ళీ చాలా కాలానికి దొరికారు వారే చాహల్,కులదీప్. ఈ ఇద్దరు జట్టుకు కీలకమైన విజయాలు అందించడంలో ముఖ్యపాత్ర పోషించారు..వీరు ఇద్దరు టీం ఇండియా కి కీలకమైన ఆటగాళ్లుగా మారిపోయారు..అయితే   చాహల్ భారత తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ప్రవేశించిన సమయంలో

 Image result for chahal dhoni

చాహల్ ఎంతో తడబడేవాడట అందరూ సీనియర్స్ అందులోనూ ముఖ్యంగా ధోనీ లాంటి వారితో ఎలా ప్రవర్తించాలో తెలియక తెగ కంగారు పడిపోయేవాడట అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పిన చాహల్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాహల్ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలిపాడు..జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ధోనీ చేతుల మీదుగా వ‌న్డే క్యాప్ అందుకున్నాను...అయితే

 Image result for chahal dhoni

అదేసమయంలో ధోనీ ని మొదటి సారి కలుసుకున్నాను అత‌నితో మాట్లాడ్డానికి చాలా భ‌య‌ప‌డేవాడిని..అయితే ధోనీ మాత్రం చాలా సింపుల్ గా ఉండేవాడు..అసలు ఒక స్థాయిలో ఉన్న ధోనీ అంత సింపుల్ గా ఉంటాడని అనుకోలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు..అయితే ఒకానొక సమయంలో ధోనీ సర్ అని పిలిచాను అయితే ధోనీ నా దగ్గరకి వచ్చి ధోనీ లేదా మహి లేదా భాయ్.. ఈ మూడు పేర్లతో పిలు అంటూ చెప్పాడట సర్ అని పిలవద్దు అని చెప్పడంతో అతడు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడని తెలిపాడు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: