కోహ్లీ పై ఆస్టేలియా మాజీ దిగ్గజం బౌలర్  మెగ్ గ్రాత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు..కోహ్లీ గొప్ప ఆటగాడు కావచ్చు అయితే త్వరలో జనగనున్న ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెగ్ గ్రాత్ అన్నాడు..కోహ్లీ మంచి బ్యాట్స్ మెన్ అని చెప్పడంలో సందేహం లేదు కానీ ఇంగ్లాండ్ లోని పరిస్థితులు కోహ్లీ కి అనుకూలంగా మాత్రం ఉండవు అని చెప్పాడు.

 Image result for virat kohli

అంతేకాదు కోహ్లీ కి ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ను ఎదుర్కోవడం అత్యంత కష్టమైనా విషయమని తేల్చి చెప్పాడు... కోహ్లీపైనే భారత్ ఆధారపడితే మాత్రం దారుణమైన ఫలితాలని చవి చూడాల్సి వస్తుందని తెలిపాడు..ఈ పర్యటనలో అయితే ఈ పర్యటనలో మాత్రం పుజారా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని మెగ్ గ్రాత్ తెలిపాడు..భారత బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ లు రాణిస్తారని భారత జట్టు సమష్టిగా రాణిస్తేనే ఫలితం దక్కుతుందని జోస్యం చెప్పుకొచ్చాడు.
Related image

ఇదిలాఉంటే ఎన్నో దేశాలలో కోహ్లీ వీరోచితమైన ప్రతిభని కనబరిచాడు..అయితే ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం తడబాటు పడటం చూస్తుంటే కోహ్లీ అభిమానులు తీవ్రమైన నిరాశకి లోనవుతున్నారు ఇంగ్లాండ్ పిచ్ లని ఎదుర్కోవడం కోహ్లీ వల్ల కావడంలేదు అంటూ కామెంట్ కూడా రావడం తో ఎలాఅయినా సరే తన సత్తా చాటాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: