భారత మాజీ కెప్టెన్ ధోనీ ఏమి చేసిన సంచలనమే..తన హెలికాఫ్టర్ షాట్స్ తో ఎంతో మంది క్రికెట్  ప్రేక్షకులని తన అభిమానులుగా చేసుకున్న ధోనీ  అనతికాలంలోనే ఎంతో మందికి ఆరాధ్యుడు అయ్యాడు..అయితే ధోనీ ఈ మధ్య ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు..కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ధోనీ తన కూతురు తనని మనిషిగా చేసింది అంటూ ఎన్నో విషయాలు తన అభిమానులకి షేర్ చేశాడు ..

 Image result for dhoni fitness

అయితే తాజాగా ఒక అవార్డు వేడుకల కార్యక్రమంలో ధోని మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు..ధోనీ తన  ఫిట్ నెస్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.. వికెట్ల మధ్య పరుగెత్తడంలో ధోనీతో యువ క్రికెటర్లు కూడా పోటీ పడలేరని చెప్పడం అతిశయోక్తి కాదు. పలు సందర్భాల్లో ఇది రుజువైంది. అయితే, ఫిట్ గా ఉండటం కోసం తాను ఎన్ని త్యాగాలు చేశాడో ధోనీ చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన చికెన్, చాక్లెట్స్, మిల్క్ షేక్స్ కు దూరమయ్యానని చెప్పాడు.

 Image result for dhoni fitness

అయితే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు చేయకూడనివి చాలనే ఉంటాయి..అయితే మనం వాటికి బానిస ఐతే వాటిని వదులుకోలేక పొతే లక్ష్యాన్ని చేదించలేము అని తెలిపాడు..అంతర్జాతీయ క్రెకెట్ లోకి అడుగుపెట్టినప్పుడే అనుకున్నానని ధోనీ చెప్పాడు. 'బటర్ చికెన్, సాఫ్ట్ డ్రింక్స్ బాగా తీసుకునేవాడిని... ఎప్పుడైతే 28 ఏళ్ళు వచ్చాయో అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్ షేక్స్ తీసుకోవడం మానేశా... ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ కు దూరమయ్యా... టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకున్నా' అని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: