ఫిఫా ప్రపంచాన్ని ఊపేస్తున్న బంతాట వ్యవహారిక బాషలో చెప్పాలంటే ఫుడ్ బాల్ గేమ్ ఈ గేమ్ ఎంత చరిత్ర సృష్టిస్తోందో అందరికీ తెలుసు..కోట్లాది మంది టీవీలకి అతుక్కుపోయి మరీ తదేకంగా చూస్తున్నారు..యాడ్ ఎజన్సీలకి కాసుల వర్షం కురిసిపోతోంది..ఫిఫాని అడ్డుపెట్టుకుని కొన్ని కోట్ల రూపాయల మార్కెట్ ఇక్కడ జరుగుతోంది..అయితే ఈ గేమ్ యొక్క పాపులారిటీ తెలుసుకోవాలంటే ఒక ఉదాహరణ కూడా ఉంది అందేంటంటే ఇంగ్లాండ్ జట్టు వేరొక దేశంతో పోటీ పడుతున్న రోజునే ఇంగ్లాండ్ రాజకుమారుడు వివాహ వేడుకలు సైతం జరిగాయి అయితే ఆ సమయంలో రాకుమారుడి పెళ్లి కంటే కూడా అధికశాతం మంది ఆటనే వీక్షించారట. అయితే

.Image result for fifa world cup indian girl

ఇలాంటి ఫిఫా వేదికపై భారత బాలికకి అరుదైన గుర్తింపు లభించింది...ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అధికారిక మ్యాచ్‌ బాల్‌ క్యారియర్‌ (ఓఎంబీసీ) గా వ్యవహరించిన తొలి భారత బాలికగా నథానియా చరిత్ర సృష్టించింది..ఫిఫా కప్‌లో భాగంగా శుక్రవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో బ్రెజిల్‌-కోస్టారికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు నథానియా “బాల్‌గర్ల్‌” గా వ్యవహరించింది. మాజీ ఛాంపియన్, రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టైటిల్ రేసులో ఒకటిగా ఉన్న బ్రెజిల్‌ను సగర్వంగా మైదానంలోకి తీసుకు వచ్చింది..ఇంతకీ ఈ నదియా ఎవరు

 Image result for fifa world cup indian girl

తమిళనాడులోని నీలగిరికి చెందిన నథానియాకు ఫుట్‌బాల్ ఆట అంటే ఎంతో ఇష్టం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీ స్కూల్‌లో ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఫిఫా స్పాన్సర్ అయిన కియా మోటార్స్ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో నెగ్గిన నథానియా ఈ గౌరవం దక్కించుకుంది. ఆమెతోపాటు కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషీ తేజ్‌ కూడా బాల్‌బాయ్‌గా ఎంపికయ్యాడు.

 Image result for fifa world cup indian girl

భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ట్రయల్స్‌ నిర్వహించి వీరిని ఎంపిక చేశాడు. తనకు దక్కిన గౌరవంపై నథానియా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నథానియా మాట్లాడుతూ "నా అభిమాన ఆటగాడైన నెయ్‌మార్‌ను కలిసే అవకాశం దక్కిందని తెలిపింది....అయితే తానూ ఈ గౌరవానికి ఎంపికవుతానని ముందు నుంచీ తాను విశ్వాసంతో ఉందని ప్రపంచక్‌పలో తనను చూశాకైనా భారత్‌లో ఎంతోమంది బాలికలు ఫుట్‌బాల్‌లోకి వస్తారు" అని నథానియా విశ్వాసం వ్యక్తం జేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: