క్రికెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులోనూ టీ -20 ప్రపంచకప్ అయితే ఈ మ్యాచ్ లు ఆడేది మహిళా క్రికెటర్లు...మహిళల క్రికెట్ ని అమితంగా ఇష్టపడే వారికి ఈ గుడ్ న్యూస్ అనే చెప్పాలి...అంతర్జాతీయ క్రికెట్‌లో మరో భారీ సమరానికి త్వరలో తెరలేవనుంది. మహిళల టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ఐసీసీ సోమవారం విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఈ ఏడాది నవంబర్‌లో జరుగనుంది.

 ICC confirm schedule for Womens T20 World Cup

ఈ మ్యాచ్ లలో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌, మూడు సార్లు ప్రపంచకప్ విజేతలు ఆస్ట్రేలియా, ఐసీసీ మహిళ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో సహా ఇండియా, న్యూజిలాండ్...పాకిస్థాన్...సౌతాఫ్రికా.. ఇలా పది దేశాలు ఈ టోర్నమెంట్‌లో తమ ప్రతిభని చూపించనున్నాయి..అయితే ఈ టోర్నీ మొత్తం  వెస్టిండీస్ వేదికగా జరుగనుంది...అయితే అంతకు ముందు ఈ టోర్నమెంట్‌ కోసం జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌లు జూలై 7 నుంచి 14 వరకూ నెదర్లాండ్స్‌లో జరుగుతాయి.

 Image result for women cricket world cup t-20

అయితే ఇందులో బంగ్లాదేశ..ఐర్లాండ్..ది నెదర్లాండ్స్..పపువా న్యూ గినియా..స్కాట్‌ల్యాండ్..థాయ్‌ల్యాండ్...ఉగాండ.. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొంటాయి. ఇందులో క్వాలిఫై అయిన రెండు దేశాలతో రెండు గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. గ్రూప్‌-ఏలో వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, క్వాలిఫయర్-1 జట్లు, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇండియా, క్వాలిఫయర్-2 జట్లు ఉన్నాయి...అయితే ఈ టోర్నీలు భారత్ జట్టు మొదటి మ్యాచ్ ని న్యూజిలాండ్ తో ఆడనుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: