ఫుడ్ బాల్ ఇప్పుడు ఈ పేరు చెప్తే గుర్తుకు వచ్చేది మెస్సీ..అత్యంత ప్రతిభావంత ఆటగాళ్ళలో మెస్సీ ఒకడు..తన ఆటకి సాటిలేదు ఒక్కసారి తన కళ్ళకి బంతి అందివచ్చింది అంటే..ఫలితం ఏ విధంగా ఉంటుందో చాంపియన్స్‌ లీగ్‌ ప్రత్యర్థులకు ఎంతో చక్కగా తెలుసు..అయితే కానీ అర్జెంటీనా తరఫున అతడి ప్రదర్శన మరోమారు నిరాశనే మిగిల్చింది...ఎంతో మంది అభిమానుల ని నిరాశలోకి నెట్టేసింది... నాలుగేండ్ల కిందట చిరకాల ప్రత్యర్థి బ్రెజిల్‌ గడ్డపై ప్రపంచకప్‌ కల నెరవేర్చుకునేలా కనిపించినా.. ఆఖరి క్షణాల్లో జర్మనీ కప్పును తన్నుకుపోయింది.

 

ఇక ఆఖరు ప్రయత్నంగా రష్యాలోనైనా కప్పు సాధించాలనే స్వప్నంతో ఇక్కడ అడుగిడిన మెస్సీ ప్రపంచకప్‌ యాత్ర ఈసారీ క్వార్టర్స్‌కు చేరకుండానే ముగిసింది. గ్రూప్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లో గానీ గోల్‌ కొట్టని మెస్సీ, ప్రీ క్వార్టర్స్‌లో ఓ గోల్‌కు సహకారం అందించాడు...అయితే అర్జెంటీనా విజయానికి అది ఏమాత్రం సరిపోలేదు...తన ప్రత్యర్ధి జట్టు గోల్‌ పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే సహచరుల నుంచి చురుకైన సహకారం కొరవడిన మెస్సీ అత్యంత సాధారణ ఫుట్‌బాలర్‌గా కనిపించసాగాడు..

 Image result for messi football

అయితే ఈ క్రమంలో మెస్సీ ఏమి చేయలేక పోయాడు..మైదానంలో నిస్సహాయ స్థితిలో మెస్సీని చూడటం అత్యంత అరుదు..కానీ ఫ్రాన్స్‌తో పోరులో ద్వితీయార్థంలో మెస్సీ పరిస్థితి ఇదే..ఎప్పుడు అలాంటి పరిస్థితులో మెస్సీ ని చూడని అభిమానులు ఒక్క సారిగా కుదేలయ్యిపోయారు..మూడు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ.. ఇప్పుడు ఫామ్ లో ఉండికూడా విజయానికి దూరం అయ్యాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: