భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన రికార్డు సాధించాడు.  మంగళవారం భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ-20లో ధోని ఈ ఘనతను సాధించాడు.అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన తొలి కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 
Image result for ms dhoni stumping
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్ 14 ఓవర్ మూడో బంతికి జానీ  బెయిర్‌స్టో (0)ను స్టంపింగ్‌ చేయడంతో.. కమ్రాన్‌ అక్మల్‌(32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ధోని సమం చేశాడు.  బంతికే జో రూట్‌ను స్టంపౌట్‌ చేసి టీ-20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపరగా మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన రికార్డును తన పేరిట లికించుకున్నాడు.

టీ-20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్ల  జాబితాలో ధోని తర్వాత కమ్రాన్‌ అక్మల్‌(32), మహ్మద్‌ షెహజాద్‌(28), ముష్ఫీకర్‌ రహీం(26), కుమార సంగక్కర(20)లు వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో కమ్రాన్‌ అక్మల్‌, కుమార సంగక్కరలు రిటైర్ మెంట్ ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: