సెలబ్రిటీస్ బయోపిక్ సినిమాలు హిట్ అవడం కామనే.. అయితే అందులో క్రీడాకారుల జీవిత చరిత్రలు హిట్ అవడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. మిల్కా సింగ్ జీవిత చరిత్రతో భాగ్ మిల్కా భాగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది అయినా ఆ తర్వాత క్రీడాకారుల బయోపిక్ పై అంత గురి పెట్టలేదు.  


నీరజ్ పాండే డైరక్షన్ లో వచ్చిన ఎమ్మెస్ ధోని బయోపిక్ సూపర్ హిట్ అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనిగా నటించిన ఈ సినిమా ధోని ప్రతిష్టత ఇంకా పెంచేలా చేసింది. ధోని జీవితంలో ముఖ్య ఘట్టాలని తీసుకుని ఈ సినిమా తీయడం జరిగింది.   


సినిమాలో ధోని బాల్యం.. ఎడ్యుకేషన్.. క్రికెట్ మీద ఆసక్తి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలి రావడం.. క్రికెట్ లోని కష్ట నష్టాలు.. జట్టులో ఎంపిక ఇలా అన్ని విభాగాలను టచ్ చేశారు. ఎమ్మెస్ ధోని అంత పెద్ద హిట్ ఎందుకు అయ్యిందంటే ధోని మీద జనాలకు ఉన్న ప్రేమ అలాంటిదని చెప్పొచ్చు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఇన్ స్పైరెడ్ మూవెస్ కలిసి ఈ సినిమా నిర్మించారు. సినిమాలో 2011 వరల్డ్ కప్ సీన్ హైలెట్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: