క్రికెట్ అనేది ఈ దేశం లో ఒక మతంగా మారి చాలా దశాబ్దాలు గడుస్తోంది .. క్రికెట్ కి దేవుడు అంటూ సచిన్ టెండూల్కర్ ని ఈ దేశం లో ప్రతీ ఒక్కరూ పిలుచుకుంటారు. అయితే క్రికెట్ కి నాయకత్వాన్ని నేర్పించిన ఘనత మాత్రం ధోనీ దే. తిరుగులేని , అంతులేని నాయాకత్వాన్ని క్రికెట్ కి ఆపాదించిన తోపు లీడర్ ధోనీ. లీడర్ అంటే ఇలా కూడా ఉండచ్చా అనే విధంగా కేవలం ' ప్రశాంతత ' ' కూల్ యాటిట్యూడ్ ' తో కప్పుల మీద కప్పులు - అసాధ్యాల ని సుసాధ్యాలు చెయ్యడం ధోన్ గొప్పతనం. అనేక సార్లు ఈ విషయాన్ని అతను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు .. 

Ms Dhoni Photos Download


ధోనీ అసలు బలం అతని ఫిట్ నేస్ - 


36 ఏళ్ల సీనియర్‌ క్రికెటర్‌ అయిన ధోనీ ఫిట్‌నెస్‌ విషయంలో 20 ఏళ్ల యువ ఆటగాళ్లతో సైతం పోటీపడతాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా సరదాగా టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాతో పరుగు పందెంలో కూడా ధోనినే నెగ్గాడు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది.వికెట్ల మధ్య ధోనితో పరుగెత్తాలన్నా సహచర ఆటగాళ్లుకు సవాలే. ఇటీవల ఐపీఎల్‌ సందర్భంగా తన సహచర ఆటగాడు డ్వేన్‌ బ్రావోతో త్రీ రన్స్‌ ఛాలెంజ్‌లో ధోనినే నెగ్గిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌ కోసం ధోనీ తనకెంతో ఇష్టమైన ఎన్నో ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ ఉంటాడు ధోనీ .. తప్పనిసరిగా మారాలి. మెరుగైన ఫలితాలు సాధించాలనుకున్నప్పుడు కొన్ని మార్పులు అవసరం. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నాడు మనోడు . ఎప్పుడైతే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడో  అప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలతో పాటు కబాబ్స్‌ తీసుకుంటున్నాడు 


Ms Dhoni Wife Pic


ఏ కెప్టెన్ కి లేవు :


ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే ఏ కెప్టెన్ సాధించలేని రికార్డులు ధోనీ ఖాతా లో ఉన్నాయి. బ్యాట్స్ మెన్ గా వికెట్ కీపర్ గా ధోనీ రికార్డుల కంటే ఒక కెప్టెన్ గా మహా మహులు , హేమాహేమీలు సైతం సాధించిన రికార్డులు ధోనీ సొంతం. తిరుగులేని రికార్డుల మొత్తం మోగిస్తాడు కెప్తెన్సీ లో. మొదట్లో హిట్టర్ గా టీం లోకి అడుగు పెట్టి ఆ తరవాత తన కూల్ నెస్ తో అందరినీ ఆకట్టుకుని కెప్టెన్ ఐన కొన్నేళ్ళ లోనీ వరల్డ్ కప్ తెచ్చి ఇండియా ముంగిట నిలిపాడు. వరల్డ్ కప్ ఎత్తుకొడానికి కొన్ని నిమిషాల ముందర ధోనీ కొట్టిన సిక్సర్ భారత క్రికెట్ అభిమానుల మనస్సులో ఎప్పటికీ ఉండిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. ఐసీసీ ప్రకటించిన టాప్ 11 ఎవర్ గ్రీన్ ఆటగాళ్ళ లిస్టులో కూడా ధోనీ కే కెప్టెన్ పదవి ఇచ్చారు అంటే అంతకంటే గొప్పతనం ఎవరికైనా ఏముంటుంది ?


Dhoni Pics


అంతులేని రికార్డులు :


బ్యాట్స్ మెన్ గా యావరేజ్ మైంటైన్ చెయ్యడం , మిడిల్ ఆర్డర్ లో లోయర్ ఆర్డర్ లో ఎక్కడ వచ్చినా తన సత్తా చాటడం లో ధోనీ మొనగాడు. అదే రకంగా కీపింగ్ లో కూడా ఎవ్వరూ సాధించలేని రికార్డులు మనోడు సాధించాడు. రీసెంట్ గా ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్ లో కూడా దుమ్ము దులిపెసాడు ధోనీ ..ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్‌ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జో రూట్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్‌ సాధించాడు. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్‌ కూల్‌’ ధోని అధిగమించాడు.


Dhoni And Sakshi Photos

బర్త్ డే బాయ్ : 


ఈ నెల 7 న ధోనీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు ., ఫాన్స్ కి అయితే అదొక పండగ అనే చెప్పాలి. చెన్నై నుంచి డిల్లీ వరకూ ఆ రోజు ధోనీ అభిమానులు రచ్చ రంభోలా చేస్తారు .. సేవా కార్యక్రమాల దగ్గర నుంచీ అనేక విందు వినోదాలు ఆ రోజు ఫాన్స్ సొంతం .. యాంటీ ఫాన్స్ ని కూడా వీరాభిమానులుగా మార్చేసుకోగల దమ్మున్న ఏకైక ' నాయకుడు ' ఈ దేశానికి ధోనీ ఒక్కడే..  హై హై  నాయక భారత క్రికెట్ పరిపాలక  .. పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ 


మరింత సమాచారం తెలుసుకోండి: