భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ పేరు తెలియని క్రికెట్ ఆటగాడు ఉంటాడా..? సాధారణ జీవితం నుంచీ ఉన్నతమైన స్థాయి వరకూ ఎదిగిన ధోనీ..ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ని సొంతం చేసుకున్నాడు. .ఎంతో సింపుల్ గా సహజంగా బ్రతికే ధోనీ అత్యన్నతమైన శిఖరాలు చేరడానికి అతడి పట్టుదలే ఆటమీద ఉన్న మక్కువే కారణం..ఒక కెప్టెన్ గా భారత్ కోసం ఆడుతున్న భాద్యత గల ఆటగాడిగా ధోనీ ఎంతో పట్టుదలతో నిలిచాడు గెలిచాడు..చివరికి కోట్లాది మంది ప్రజలకి ఆరాధ్యుడు అయ్యాడు..అయితే

 Image result for dhoni birthday celebrations with family

ఈరోజు అనగా జులై 7 న తన పుట్టినరోజుని పురస్కరించుకుని కోట్లాది మంది భారతీయులు పండగ చేసుకుంటున్నారు..సామాజిక మాధ్యమాలలో ధోనీ కి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి..మ్యాచ్‌ నిమిత్తం ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈసందర్భంగా పాండ్య బ్రదర్స్‌ ‘హ్యాపీ బర్త్‌డే మహీ’ అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 Related image

ఈ సందర్భంగా ధోనీ భార్య సాక్షితో సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

 

 సాక్షి సింగ్‌ రావత్‌ (ధోనీ భార్య)

“హ్యాపీ బర్త్‌ డే టూయూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.’

వీరేంద్ర సెహ్వాగ్‌

 “ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్‌ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమ’’

 సురేశ్‌ రైనా

500 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్‌ పుట్టినందుకు భారతావని గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే ధోనీ బ్రదర్‌. నువ్వేనాకు స్ఫూర్తి. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది. నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నీలాగ ఎవ్వరూ ఉండలేరు మ్యాన్‌!

రవీంద్ర జడేజా

పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. మాకు ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టినందుకు నీకు ధన్యవాదాలు.

కత్రినా కైఫ్‌

హ్యాపీ బర్త్‌డే ధోనీ! ఐసీసీ ట్రోఫీలన్నింటినీ సాధించి చరిత్ర సృష్టించిన ఏకైక కెప్టన్‌. నిన్ను చూసి గర్వపడుతున్నాను లెజెండ్‌. నీకంతా మంచే జరగాలి.

ఇలా ఎంతో మంది ప్రముఖులు కోట్ల సంఖ్యలో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనికి తెలిపారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: