ఇటీవల దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్‌ అవుట్‌ వీడియోలను పోస్ట్‌ చేశారు.  అయితే దేశ వ్యాప్తంగా రక రకాల ఛాలెంజ్ విసురుతున్నారు.  అయితే ఆ ఛాలెంజ్ వల్ల పర్యావరణానికి, మనుషులకు, దేశానికి మంచి చేస్తే ఎవరైనా స్వీకరించవచ్చు.  


 తాజాగా తెలంగాణ నేతలు మాత్రం పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) విసిరిన చాలెంజ్‌ను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్వీకరించారు. కేటీఆర్‌ విసిరిన హరితహారం చాలెంజ్‌ స్వీకరించిన సచిన్‌ కొన్ని మొక్కలు నాటారు. అనంతరం నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. 


తనను ఇలాంటి చాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు సచిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, భారత దేశం గర్వించ దగ్గ క్రికెటర్ అయిన సచిన్ తన ఛాలెంజ్ స్వీకరించి ఆచరించడం తో కెటీఆర్ ఎంతో సంతోషంలో ఉన్నారు.  సచిన్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ.. థ్యాంక్యూ మాస్టర్‌.. మీరు కూడా మరో ఐదుగురిని హరితహారం చాలెంజ్‌కు నామినేట్‌ చేయండి అని సచిన్‌కు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: