అతడు గ్రౌండ్ లోకి అడుగు పెడితో..చిరుత సైతం బయపడుతుంది..ఎందుకంటే ఆ వేగానికి చిరుత కూడా తట్టుకోవడం కష్టం. అంత వేగంగా పరుగెడుతూ చూపరులకు కళ్లను కట్టిపడేసే కెన్యాస్టార్ అథ్లెట్, 400 మీటర్ల హార్డిల్స్ వరల్డ్ ఛాంపియన్ నికోలస్ బెట్ ఇకలేరు.  కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్, ప్రపంచ మాజీ చాంపియన్‌ నికోలస్‌ బెట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Kenyan athlete Nicholas Bett killed in road accident - Sakshi
బుధవారం పశ్చిమ కెన్యాలో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల బెట్‌  దుర్మరణం పాలయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. అతనికి రెండు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.  ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లుగా అధికారులు తెలిపారు.

2015లో చైనాలో జరిగిన అథ్లెటిక్‌ పోటీల్లో 800 మీటర్ల కన్నా తక్కువ దూరం పరుగులో ప్రపంచ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన తొలి కెన్యన్‌ గా నికోలస్‌ బెట్‌ నిలిచి చరిత్ర సృష్టించాడు.  బెట్‌ మృతిపై కెన్యా అథ్లెటిక్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్రీడా రంగంలో అతని లోటు పూడ్చలేనిదని పేర్కొంది.  నికోలస్‌ మరణాన్ని ధ్రువీకరించిన కెన్యా క్రీడల శాఖా మంత్రి రషీడ్‌ ఇచేశా, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: