ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు..మొదటి రోజు మొదలు ప్రతీ రోజు ఎదో ఒక విభాగంలో పతకాలని సాధిస్తున్నారు..ఇండోనేషియా వేదికగా  జరుగుతున్న ఈ పోటీలలో భారతీయులు సాధిస్తున్న విజయాలు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని ప్రధాని మోడీ  ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తమ సందేశాన్ని ఇస్తున్నారు అయితే భారతీయ ప్రేక్షకుల నుంచీ ఎంతో ఆదరణ లభిస్తోంది అంటూ క్రీడాకారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఇదిలాఉంటే..

 Related image

 బుధవారం జరిగిన పురుషుల వుషు సందా 65 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన నరేందర్ గ్రెవాల్ కాంస్య పతకం సాధించాడు...ఈ విభాగంలో సెమీ ఫైనల్స్ బౌట్‌లో ఫోరౌడ్ జఫారీ చేతిలో ఓడినప్పటికీ నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని దక్కించుకోవడం విశేషం.దాంతో తాజా పతకంలో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది..ఇప్పటి వరకూ భారత ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8కాంస్యాలు ఉన్నాయి.

 Image result for asian games narendra grewal

వుషు విభాగంలో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం.అ..అయితే కేవలం ఒక్క బుధవారం లో దాదాపు పుషు విభాగంలో భారత క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు..ఆసియా కప్ లో విజయం సాధించిన ప్రతీ ఒక్కరికి భారతీయులు బ్రహ్మరధం పడుతున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: