ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతోంది..ఎన్నడూ లేనంతగా క్రీడాకారులు చక్కని ప్రతిభతో ఎన్నో పతకాలు భారత్ ఖాతాలో వేస్తున్నారు..కబడ్డీ పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేది భారత దేశం అలాంటిది ఆసియా గేమ్స్ లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఎన్నడూ లేని విధంగా ఓటమి పాలయ్యైంది..ప్రతీ సారి స్వర్ణం గెలుచుకునే భారత జట్టు ఈసారి కాంస్య తో సరిపెట్టుకుంది..వివరాలలోకి వెళ్తే...

 India mens kabaddi team fails to make final for first time after Iran loss in semi-final - Sakshi

ఆసియా క్రీడల్లో సెమీస్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఓటమి చెందటంతో  కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల జట్టుకు ఇరాన్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది..భారత్‌ 18–27తో పరాజయం చవిచూసింది. 1990లో  బీజింగ్‌ ఆతిథ్యమిచ్చిన ఏషియాడ్‌లో తొలిసారి ఈ గ్రామీణ కబడ్డీ క్రీడను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాలుగేళ్లకోసారి ఎదురులేని భారత జట్టు స్వర్ణం సాధిస్తూనే ఉంది.

 Image result for asian games kabaddi 2018

అయితే ఇరాన్ భారత్ చేతిలో వరుసగా రెండు సార్లు గతంలో ఫైనల్స్ లో ఓడిపోయింది కానీ ఈసారి మాత్రం భారత్ ని ఓడించి స్వర్ణం ఎగరేసుకుని పోయింది..అయితే ఆట ప్రారంభంలో భారత ఆటగాళ్ళు 6–4తో జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఇరాన్‌ రైడర్లు, డిఫెండర్లు ఒక్కసారిగా ఫాం లోకి రావడంతో భారత్ ఒక్క సారిగా ఆలౌటైంది. ఇరాన్‌ ఆటగాళ్లు మిఘాని, అత్రాచలి భారత రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు..దాంతో భారత్ కి పరాభవం తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: