ఆసియా గేమ్స్ 2019 లో సింధూ తనదైన శైలిలో దూసుకు వెళ్తోంది.. షట్లర్‌ లో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన తెలుగు తేజం సింధూ ఆసియా గేమ్స్ లో తెలుగు జాతి..యావత్ దేశం గర్వపడేలా తన ప్రతిభని చాటి చెప్తోంది.. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో సింధూ ఫైనల్ లో కి దూసుకు వెళ్ళింది..పసిడి పోరుకు తనతో ఎవరు వస్తారు అంటూ ఛాలెంజ్ విసురుతోంది..సింధూ ఈరోజు చూపించిన తెగువని ప్రతీ భారతీయుడు తలెత్తుని చెప్పుకునేలా చేసింది..పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for sindhu asian games

ఈరోజు (సోమవారం) జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో రెండో ర్యాంకర్ యామగూచి(జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది...దాంతో సింధూ కి రజిత పతకం ఖాయం అయ్యింది దీంతో సిందూ పసిడి కోసం పోరు సలపాల్సి ఉంది..ఈ రోజు జరిగిన పోరులో సింధూ ఎంతో అద్భుతమైన ప్రదర్సన చేసిందని యావత్ భారత్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

 Image result for sindhu asian games

సుదీర్ఘమైన ర్యాలీతో ఆకట్టుకున్న యామగూచిపై పీవీ సింధు తన అనుభవాన్ని ఉపయోగించి ఓడించింది.. అంతేకాదు ఆసియా గేమ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది..ఫైనల్స్ లో సింధూ గెలిచి స్వర్ణం తీసుకురావాలని ఆశిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: