ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా మంగళవారం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దుబాయిలోని అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్‌తో తలపడనుంది.  'గ్రూప్‌-ఎ'లో భారత్, హాంకాంగ్‌ జట్ల మధ్య సాయంత్రం 5 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి బుధవారం పాక్‌తో జరిగే కీలక పోరుకు సిద్ధమవ్వాలని భారత్ భావిస్తోంది.  రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్ లో సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

జట్టులో ఎలాగూ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు కాబట్టి రోహిత్ పై కెప్టెన్సీ ఒత్తిడి ఉండదు. కాగా, మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ "వన్డే జట్టులోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు. రాయుడు, జాదవ్‌లు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. ఆ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా" అని రోహిత్ శర్మ తెలిపాడు. 


తుది జట్లు(అంచనా):
భారత్‌:
రోహిత్‌, ధావన్‌, రాహుల్‌, అంబటి రాయుడు, ధోని, కేదారజ్‌ జాదవ్‌/మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, చాహల్‌.
హాంకాంగ్‌:
నిజ్కత్‌ ఖాన్‌, అన్షుమాన్‌ రాఠ్‌, బాబర్‌ హయత్‌, కించిత్‌ షా, క్రిస్టొఫర్‌ కార్టర్‌, ఎహ్‌సాన్‌, ఇజాజ్‌, స్కాట్‌ మెకెనీ, అఫ్జల్‌, నవాజ్‌, నదీమ్‌ అహ్మద్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: