భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుదేశాల్లోని అభిమానులే కాదు.. గ్యాంగ్ స్టర్లు కూడా వీక్షించడానికి ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. మొదటి నుంచి నువ్వా అంటే నువ్వా అంటూ పోరుకు సిద్దమయ్యే భారత్-పాక్ ఆటగాళ్ల తీరు ఎప్పుడూ సంచలనంగా ఉంటుంది.  గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తో పాటు హాంకాంగ్ జట్లు టైటిల్ రేస్‌లో ఉన్నాయి.  ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తోంది. 


 కాగా,  భారత్-పాక్ మ్యాచ్ గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నెట్‌వర్క్‌కి ముఖ్యమైన సమాచారం అందింది.  దావూద్ ఇబ్రహీం, డి కంపెనీకి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు ఈ మ్యాచ్‌ వీక్షించనున్నారని ఏజెన్సీలకు సమాచారం అందింది.  రౌండ్ రాబిన్ పద్ధతిన టోర్నీ జరుగుతుండటంతో గ్రూప్ దశలో మూడు జట్లు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి.

Image result for భారత్ పాకిస్థాన్ మ్యాచ్

మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే.. అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ముంబై, కరాచీ నగరాల  క్రికెట్ అభిమానులు, మాఫియా  మ్యాచ్ చూడటం కోసం దుబాయ్‌ వెళ్లారు. దీంతో భారత్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మ్యాచ్‌పై నిఘా పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: