ఆసియా కప్‌ టోర్నీలో భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థానే రేపటి మ్యాచ్ లో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్ పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి సారిస్తున్నారు.  తాజాగా భారత్ — పాక్ జట్ల మద్య జరిగే ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. భారత్ ప్రధాన పోటీదారుగా నిలిచినా.. టైటిల్ మాత్రం పాకిస్థాన్ గెలించేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నాడు. ఆసియా కప్‌ టోర్నీలో గెలుపు దక్కించుకోవడానికి పాకిస్థాన్ గట్టి పట్టుమీద ఉందని అన్నారు. 


అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  అంతే కాదు ఇతర జట్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లాడుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 


తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..భారత్, పాకిస్థాన్ జట్టు టైటిల్ ఫెవరెట్లు. కాగా యూఏఈలో రెగ్యులర్‌గా సిరీస్‌లు ఆడుతుండటం పాక్‌కు కలిసొచ్చే అంశం. వారికి ఆ పిచ్, పరిస్థితులు సులువుగా అర్థమవుతాయి. భారత క్రికెటర్లు కూడా మంచి సమర్థులే కానీ..ప్రస్తుతం కోహ్లీ లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: