రేపు ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 19న దుబాయిలో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 2018 ఆసియా కప్‌ పోటీల్లో ఎన్ని మ్యాచ్‌లున్నా...చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.  రౌండ్ రాబిన్ పద్ధతిన టోర్నీ జరుగుతుండటంతో గ్రూప్ దశలో మూడు జట్లు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి.   బుధవారం పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకోనుంది.
   à°†à°¸à°¿à°¯à°¾ కప్ : రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ 2018 టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌‌కు ముహూర్తం ఖరారవ్వడంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానుల ఆనందానికి అడ్డే లేదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తొలిసారిగా ఓ వన్డే మ్యాచ్‌లో భారత్-పాక్ పోటీకి సిద్ధమయ్యాయి.  కాగా, గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను పాకిస్థాన్‌ 180 పరుగుల తేడాతో ఓడించి మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే రేపటి మ్యాచ్ లో ఎవరి గెలుపు ధీమా వారికే ఉన్నట్లు తెలుస్తుంది.  ఆసియాకప్‌లో భారత్‌ను ఓడించాలంటే తమ జట్టు కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందని పాకిస్థాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు.

 ఒకే టోర్నీలో పాక్‌తో మూడు మ్యాచ్‌లు

 తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు.  భారత్‌పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. టీమిండియాలో మంచి ప్లేయర్లు ఉన్నారు. కోహ్లీ లేకపోవడం జట్టుపై పెద్దగా వ్యత్యాసం చూపించదు. వారి బ్యాటింగ్ విభాగం చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది.  ఈ మ్యాచ్ మేం తప్పుకుండా గెలుస్తామన్న ధీమా ఉందని వ్యక్తం చేశారు. 

కోహ్లీ లేకపోయినా టీమిండియా సిద్ధంగా

ఇదిలా ఉంటే..టీమిండియా కెప్టెన్, ప్రధాన బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరితో పాకిస్తాన్‌తో తలపడే భారత జట్టుకు కలిగే నష్టమేమి లేదని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గైర్హాజరు..దాయాది పాకిస్థాన్‌తో బుధవారం జరిగే ఆసియా కప్‌ సమరంలో భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించాడు. 

Image result for ఆసియా కప్ భారత్ పాకిస్థాన్

అందుకు తగ్గట్టు గానే టీమ్ ఇండియా ఆటగాళ్లు చాలా సీరియస్ గా నెట్ ప్రాక్టీస్ చేస్తూన్నారు.  గతంలో పాకిస్థాన్ పై పలుమార్లు అవలీలగా గెలిచిన భారత్..ఇప్పుడు కూడా అదే కసితో ఆడుతామని అంటున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ.   మరి రేపటి భారత్- పాకిస్థాన్ ఆసియా కప్ టోర్నీ గెలుపు ఎవరు సొంతం చేసుకుంటారో అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు..సర్ఫరాజ్ అహ్మద్ సారధ్యంలోని పాకిస్థాన్‌ జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: