ప్రతిభ ఉంటే ప్రత్యేకంగా ఎవరూ గుర్తించవలసిన అవసరం లేదు గుర్తింపు దానంతట అదే వస్తుంది..కానీ అందుకు కావాల్సింది కృషి పట్టుదల..అయితే ఇలాంటి ప్రతిభావంతులు ఎంతో మంది భారత దేశంలో ఉన్నారు అని చెప్పడానికి నిదర్సనం భారత ప్రభుభుత్వం క్రీడాకారులకి అందించిన అత్యత్తమ అవార్డులు.. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ క్రమంలో ఎంతో ప్రతిభావంతుడిగా పేరున్న  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ని క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డువరించింది.

 Image result for virat kohli

అదే సమయంలో వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను కూడా 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది...అయితే వీటితో పాటుగా ద్రోణాచార్య, అర్జున అవార్డులను కూడా ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావు ద్రోణాచార్య అవార్డును కైవసం చేసుకున్నాడు. అదేవిధంగా సిక్కిరెడ్డి..రోహన్ బోపన్న లకు అర్జున అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది...ఇలా ప్రభుత్వం దాదాపు “8”  మందికి ద్రోణాచార్య అవార్డులు...20 మందికి  అర్జున.. నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డులు దక్కాయి..

Image result for khel ratna

అవార్డు గ్రహీతల వివరాలు :

 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న :

1. విరాట్ కోహ్లీ - క్రికెట్ (భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ) 

2. మీరాబాయి చాను - వెయిట్ లిప్టర్  

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు :

1.సుభేదార్ అచ్చయ్య కుట్టప్ప - బాక్సింగ్

2. విజయ్ శర్మ - వెయిట్ లిప్టింగ్

3. శ్రీనివాస రావు - టెబుల్ టెన్నిస్

4. సుఖేంధర్ సింగ్ పన్ను - అథ్లెటిక్స్ 

5. క్లారెన్స్ లోబో -  హాకీ (లైఫ్ టైమ్ అవార్డు)

6. తారక్ సిన్హా - క్రికెట్ (లైఫ్ టైమ్ అవార్డు)

7. జీవన్ కుమార్ శర్మ - జూడో (లైఫ్ టైమ్ అవార్డు)

8. వి.ఆర్ బిందు - అథ్లెటిక్స్ (లైఫ్ టైమ్ అవార్డు)

అర్జున అవార్డు గ్రహీతలు :

1. నీరజ్ చోప్రా - అథ్లెటిక్స్ 

2. జిన్స్న్ జాన్సన్ -  అథ్లెటిక్స్ 

3. హిమ దాస్  -  అథ్లెటిక్స్     
 
4. నేలకుర్తి సిక్కి రెడ్డి - బ్యాడ్మింటన్ 

5. సతీష్ కుమార్ - బాక్సింగ్ 

6. స్రితి మందాన - క్రికెట్ 

7. శుభకర్ శర్మ - గోల్ఫ్ 

8. మన్‌ప్రీత్ సింగ్ - హాకీ 

9. సవిత - హాకీ   

10. రవి రాథోడ్ - పోలో  

11. రహి సర్నబోత్ - షూటింగ్ 

12. అంకుర్ మిట్టల్ - షూటింగ్ 

13. శ్రేయాసి సింగ్ - షూటింగ్ 

14. మనిక బాత్రా - టేబుల్ టెన్నిస్ 

15. సాతియన్ - టేబుల్ టెన్నిస్ 

16. రోహన్ బోపన్న - టెన్నిస్ 

17. సుమిత్ - రెజ్లింగ్ 

18. పూజా - వుషు

19. అంకుర్ ధామ - పారా అథ్లెటిక్ 

20.మనోజ్ శంకర్ - పారా బ్యాడ్మింటన్

ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలు :

1.సత్యదేవ్ ప్రసాద్ - ఆర్చరీ

2. భరత్ కుమార్ చెత్రీ - హాకీ

3. బాబీ అలోసిస్ - అథ్లెటిక్  

4.ఛోగల్ దత్తాత్రేయ - రెజ్లింగ్  

 


మరింత సమాచారం తెలుసుకోండి: