ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ ఆటకి ఎంతో ఆదరణ ఉంది..క్రికెట్ తరువాత టెన్నిస్ ని ఎంతగానో అందరూ ఇష్టపడుతారు..టెన్నిస్ ప్రపంచంలో ఎదురులేని ప్లేయర్స్ గా ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా సరే గడిచిన రెండేళ్లుగా టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ లో తిరుగులేని విజయాన్ని సాధిస్తున్న ఏకైక ప్లేయర్ గా రఫెల్ నాదల్ రికార్డులు సృష్టించాడు. భారత్ లో టెన్నిస్ పేరు చెప్తే చాలు గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తులు సానియా మీర్జా, లియాండర్ ఫేస్ ,మహేష్ భూపతి, బోపన్న.ఇలా వీరందరూ టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని స్టార్స్ గా వారి వారి పరిమితి మేరకు విజయాలు సాధించిన వాళ్ళే..అయితే..

 Image result for french open title

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ మాత్రం వరుసగా 2017 నుంచీ చూస్తే రఫెల్ నాదల్ మెన్స్ సింగిల్స్ లో సీరీస్ టైటిల్ గెలుపొందాడు అలాగే 2018 లో జరిగిన ఫ్రెష్ ఓపెన్ లో 11వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు...దాంతో ఒకే గ్రాండ్ స్లామ్‌ను అత్యధిక సార్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ రికార్డును నాదల్ సమం చేశాడు. మార్గరెట్ 1960-73 మధ్య 11 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది. 

 Image result for french open title

32 ఏళ్ల నాదల్ 24 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరగా.. 17 టైటిళ్లను గెలుపొందాడు. 3 యూఎస్ ఓపెన్ టైటిళ్లు, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా ఓపెన్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు..ఇక మహిళ టెన్నిస్ విషయానికి వస్తే షరపోవా , సెరెనా ఇద్దరికి టెన్నిస్ లో ఓటమనేది లేదు...వరుసగా విజయాల్ని తమ ఖాతాలో ఒకరి తరువాత ఒకరు వేసుకున్నారు. ఇక సానియా మీర్జా కూడా ఏమి తక్కువ తినలేదు..ఇండియా నుంచీ టెన్నిస్ తరుపున అత్యంత ప్రతిభ కనబరిచే మహిళ క్రీడాకారిణిగా మీర్జా ఎంతో గుర్తింపు పొందారు.

 Image result for indian tennis players

ఇదిలాఉంటే 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌ మే 21 నుంచి జూన్‌ 10 లో నిర్వహించిన టోర్నీలో గత ఎదాదికంటే కూడా పారితోషకం అధికంగా చేశారు..ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సింగిల్స్ విజేతకి దాదాపు రూ.17.63 కోట్లుగా పెంచారు..అయితే గత ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ లో  భారత టెన్నిస్ స్టార్ బోపన్న జోడీ విజేతగా నిలిచింది. ఏడో సీడ్ రోహ‌న్ బోప‌న్న‌ కెనడాకు చెందిన పాట్నర్ గాబ్రియేలా దాబ్రోవ్‌స్కీల జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచారు. ఇదిలాఉంటే త్వరలో ప్రారంభం కాబోయే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కి సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పై ఇప్పటి నుంచీ ఉత్ఖంట నెలకొంది భారత్ తరుపున మళ్ళీ ఎవరు విజయాన్ని అందిస్తారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు..అయితే ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిలే కి భారీ స్థాయిలో పారితోషికం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: