పూసర్ల వెంకట సింధు..అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  చిన్న నాటి నుంచి బ్యాడ్మింటన్‌ లో అగ్రస్థానానికి చేరుకోవాలనే ఆశయంతో ఎంతో పట్టుదలతో స్టార్ బ్యాడ్మింటన్‌ పుల్లెంల గోపిచంద్ వద్ద శిక్షణ తీసుకొని 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 
Sindhu
గత యేడాది పారిస్‌లో జరిగిన చెన్‌ యుపిపై మొదటి సెట్‌లో  21-14 పాయింట్లు సాధించిన పివి సిందు, రెండో సెట్‌లో అదే జోరును కొనసాగించి21-14 తేడాతో చెన్‌ యుపిపై  విజయభేరి మోగించింది.   ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.  సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.
p.v.sindhu
ఇదిలా ఉంటే.. భారత స్టార్ షట్లర్ పివి సింధు పేరును పద్మభూషన్ పురస్కారం కోసం కేంద్ర క్రీడల శాఖ సిఫారసు చేసింది. పద్మ పురస్కారాల్లో భాగంగా ఆమె పేరును ప్రతిపాదించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన ఆమె… కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషన్ కు ఆమె పేరును సిఫారసు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: