భారత్ కి వెస్ట్ ఇండీస్ కి మధ్య జరుగుతున్న వన్డేలో..కోహ్లీ సేన మరో సారీ చెలరేగి ఆడుతోంది..అంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైజాగ్ లో ఆడిన కోహ్లీ ఈ రోజు ఆటని ఎప్పటికి మర్చిపోలేడు ఎందుకంటే విశాఖపట్నం వేదికగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల ఖాతాలో మరొక  మైలు రాయిని అందుకున్నాడు.అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.

 

దాదాపు పదివేలకు 81 పరుగుల దూరంలో ఉండగా విరాట్ విశాఖలో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.అంతకు ముందు 212 వన్డేల్లో 58.69 సగటుతో 9,919 పరుగులు చేశాడు..వీటిలో మొత్తం  36 శతకాలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

 

 

వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్

 

1. విరాట్ కోహ్లి - 213 మ్యాచ్‌లు

2. సచిన్ తెందూల్కర్ - 266 మ్యాచ్‌లు

3. సౌరవ్ గంగూలి - 272 మ్యాచ్‌లు

4. రికీ పాంటింగ్ - 272 మ్యాచ్‌లు

5. జాక్వెస్ కలిస్ - 286 మ్యాచ్‌లు

పదివేల పరుగుల ఘనతను సచిన్ 266 మ్యాచ్‌లలో సాధించగా.. విరాట్ 213 మ్యాచుల్లోనే సాధించాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: