రానున్న వరల్డ్ కప్ లో బెర్త్ తెలుగుతేజం అంబటి రాయుడికి కన్ఫర్మ్ అయ్యిందనే చెప్పాలి. తన అత్యత్భుతమైన ప్రదర్శనతో బీసీసిఐ ని ఎంతగానే ఆకట్టుకున్న రాయుడు, తనకు అందివచ్చిన అవకాశాలను చాలా చక్కగా సద్వినియోగం  చేసుకుంటున్నాడు. వెస్ట్ ఇండీస్ కి ఇండియా కి మధ్య జరుగుతున్న వన్డే సిరిస్‌లో ఇప్పటివరకు ముగిసిన నాలుగు వన్డేల్లో అంబటి రాయుడు ఓ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

 Image result for ambati rayudu

అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల బ్యాట్స్ మెన్ గా అంబటి పేరు వినపడటం గమనార్హం..ఎప్పటినుంచో జట్టు  లో నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని ఉంచాలని మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోంది...దాంతో ఈ సిరిస్‌తో భారత జట్టుకు అంబటి రాయుడు ప్రత్నామ్నాయంగా మారాడు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే అంబటి రాయుడిని నాలుగో స్థానానికి ప్రమోట్ చేశామని ఓ ప్రెస్ మీట్‌లో కోహ్లీనే స్వయంగా చెప్పాడు.

 Image result for ambati rayudu kohli

ఇదిలాఉంటే అంబటి  మొత్తం నాలుగు వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 217 పరుగులు చేశాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో రాయుడు సెంచరీతో మెరిశాడు...గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 22, వైజాగ్ వన్డేలో 73, పుణె వన్డేలో 22 తాజాగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన వన్డేలో సెంచరీ నమోదు చేశాడు...2019 వన్డే వరల్డ్‌కప్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాలో దాదాపు చోటు ఖాయం చేసుకున్నాడు.

 Image result for kohli press meet

అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం అంబటి కి వరల్డ్ కప్ లో స్థానం పై స్పందించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ వరకు మేం అతడికి మద్దతుగా  నిలవాల్సి ఉంది. ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటూ రాయుడు ముందుకు సాగుతున్నాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: