భారత జట్టు మాజీ కెప్టెన్, కలకత్తా టైగర్ సౌరవ్ గంగూలి..కి క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం..బీసీసీఐ బోర్డ్ అంటే ఎంతో గౌరవం అలాంటి దాదా ఒక్క సారిగా బీసీసీఐ పై నిప్పులు చెరిగారు..రెండేళ్లుగా బీసీసీఐ.. సీఓసీ నియంత్రణలోకి వెళ్ళిపోయిందని...ఆ అలా వెళ్లిన తర్వాత ఇండియన్ క్రికెట్, బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 Image result for ganguly writer letter to bcci

అదేసమయంలో బెంగాల్ బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్ష హోదాలో సీఓఏ పనితీరును కడిగిపారేస్తూ ఒక లఖని కూడా రాశారు..ఆ లేఖలో సారాంశం ఏమిటంటే. భారత క్రికెట్‌ పరిపాలన ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం కారణంగా ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాను. ఎన్నో ఏళ్లు క్రికెట్‌ ఆడటంతో మా జీవితాలు గెలుపోటములతో ముడిపడిపోయాయి.  భారత క్రికెట్‌ పరువు మర్యాదలు కూడా మాకు ఎంతో ముఖ్యం. అందుకే తాజా పరిస్థితి గురించి ఆలోచించాల్సి వస్తోంది అయితే అందుకు  ‘అదే విధంగా లక్షలాది అభిమానుల నమ్మకం కూడా సడలిపోతోందని ఆందోళనతో చెప్పాల్సి వస్తోంది.

 Related image

అసలు విషయాలు నాకు తెలియదు కానీ ఇటీవల వచ్చిన వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా వాటిని ఎదుర్కొన్న తీరు మొత్తం బీసీసీఐ పరువు తీసేశాయి. సీఓఏ నలుగురు సభ్యుల నుంచి ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్లున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్‌ మధ్యలో క్రికెట్‌ నిబంధనలు మారిపోతున్నాయి. కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అగౌరవపరుస్తూ పక్కన పెట్టేస్తున్నారు.’‘కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది బోర్డు వ్యవహారాల్లో భాగంగా ఉన్న నా మిత్రుడొకడు తాము ఎవరిని సంప్రదించాలని నన్ను అడిగితే సమాధానం ఇవ్వలేకపోయాను.

Image result for bcci

 అంతర్జాతీయ మ్యాచ్‌కు ఒక క్రికెట్‌ సంఘం నుంచి ఎవరినైనా పిలవాలని భావిస్తే ఎవరికి ఆహ్వానం పంపాలో కూడా అర్థం కాని పరిస్థితి.’ ‘ఎన్నో సంవత్సరాలుగా గొప్ప క్రికెటర్లు, అద్భుతమైన పరిపాలకులు చేసిన శ్రమ వల్ల వేలాదిమంది అభిమానులు మైదానాలకు వచ్చారు. దాని వల్లే భారత క్రికెట్‌ ఈ స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది ప్రమాదంలో పడిందని చెప్పగలను.అంటూ గంగూలి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: