టీమిండియా మాజీ కెప్టెన్ ,వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ,మిస్టర్ డిపెండబుల్ అయిన రాహుల్ ద్రావిడ్ కి అరుదైన గౌరవం లభించింది. ద్రావిడ్ కి ఐసీసీ  ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది...ఈ ఘనత దక్కించుకున్న ఐదవ ఆటగాడిగా రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు..తిరువనంతపురంలో గురువారం వెస్టిండీస్‌తో ఐదో వన్డేకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ఇందుకు సంబంధించిన జ్ఞాపికను అతడికి అందించారు.

 

ఇదిలాఉంటే  "బిషన్‌ సింగ్‌ బేడీ..గావస్కర్...కపిల్‌ దేవ్..అనిల్‌ కుంబ్లే" తర్వాత భారత్‌ నుంచి ఈ ఘనత అందుకున్న ఐదో క్రికెటర్‌గా ద్రవిడ్‌ నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేసిన ద్రావిడ్ తాజాగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టుకి కోచ్ గా చేసి  భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: