టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ మొత్తానికి వివాదంలో చిక్కుకున్నాడు. ఎన్నో సందర్భాలలో కోహ్లీ చేస్తున్న పనులు అతడిని వివాదంలోకి నేట్టేస్తున్నాయి. తాజాగా ఒక క్రికెట్ అభిమానిపై విరాట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి నెటిజన్ల కి దాంతో విరాట్ పై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.ఇంతకీ ఏమి జరిగిందంటే.

Image result for kohli app


కోహ్లీ తన 30వ పుట్టిన రోజు సందర్భంగా తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్ ప్రమోషన్ కోసం ఓ వీడియో పోస్టు చేశాడు. దీనిపై స్పందిస్తూ ఓ క్రికెట్‌ ప్రేమికుడు ప్రస్తుత భారత ఆటగాళ్ల కంటే తాను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లనే ఎక్కువ ఇష్టపడతానని అన్నాడు. కోహ్లికి అతడి ఆట స్థాయి కంటే ఎక్కు గుర్తింపు వచ్చింది. అందులో ప్రత్యేకత ఏమి లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు..

 Image result for kohli app

ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కంటే ఇంగ్లండ్‌..ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం అంటూ ఆ  అభిమాని చేసిన కామెంట్స్ తో ఒళ్ళు మండిన కోహ్లీ  ఆ అభిమానికి ఘాటుగా రెప్లై ఇచ్చాడు  అయితే నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపో. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి అంటూ ఫైర్ అయ్యాడు..

 Image result for kohli app

దాంతో కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలకి నెటిజన్లు ఫైర్ అయ్యారు..విదేశాల్లో పెళ్లి చేసుకుని..విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ, దేశం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నావు అంటూ విరాట్ పై ఫైర్ అయ్యారు..


మరింత సమాచారం తెలుసుకోండి: