శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య చిక్కుల్లో పడ్డాడు. వక్కలను భారత్‌కు అక్రమంగా తరలించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  శ్రీలంకను ప్రచంచ క్రికెట్‌లో ఓ బలమైన శక్తిగా నిలిపిన క్రికెటర్లలో అతనూ ఒకడు. ఎన్నో గొప్ప రికార్డులను తన ఖాతాలో లిఖించాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. భారత్‌కు కోట్ల విలువైన వక్కలను అక్రమ దారిలో పంపినట్లు సనత్ జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లపై స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి.  

sanath

టీవల నాగ్‌పూర్‌లో డైరెక్టరేట్ ఆఫ రెవెన్యూ ఇంటిలెజెన్స్ విభాగం జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  సాధారణంగా వక్కలను ఇండోనేషియా నుంచి శ్రీలంకకు దిగుమతి చేసి అక్కడి నుంచి భారత్‌కు రవాణా చేస్తారు. దీని కోసం డమ్మీ కంపెనీలను సృష్టించి..అక్కడే ఉత్పత్తి అయినట్లు డాక్యుమెంట్లు తయారుచేస్తారు. దక్షిణాసియా స్వేచ్చా వాణిజ్యం(ఎస్‌ఏఎఫ్‌టీఏ) ఒప్పందంలో భాగంగా శ్రీలంక నుంచి భారత్‌కు దిగుమతి చేసే వస్తువులకు ఎలాంటి పన్ను ఉండదు. అదే ఇండోనేషియా చేస్తే మాత్రం 108 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. 

Image result for సనత్ జయసూర్య

ఈ స్మగ్లింగ్ కేసులో సనత్ జయసూర్యతోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్త వివరాలను ముంబై పోలీసులు శ్రీలంక ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలో జయసూర్య ఇప్పటికే విచారణ కోసం ఓసారి ముంబై వచ్చి వెళ్లారు.  జయసూర్యతో పాటు ఈ స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్న మిగతా ఇద్దరు క్రికెటర్లను డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం ఉంది.  తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని... వీరు ఆ సంస్థలకు అనుమతులు పొందారని విచారణలో తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: