ప్రకృతికి కోపం వస్తే..ఎలాంటి ముఖ్యమైన పనులైనా వాయిదా వేసుకోవాల్సిందే.  తాజాగా భారత్-ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 ఆట వాన దెబ్బకు రద్దయ్యింది.   మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల జోరుముందు బ్యాట్స్‌మెన్ క్యూ కట్టడంతో కంగారు టీమ్ శుభారంభం చేయలేకపోయింది. 


ఫించ్,షార్ట్,క్రిస్ లిన్, మాక్స్‌వెల్, స్టోయినిస్ విఫలమవ్వడంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెన్ మెక్‌డోర్మెట్, ఆండ్రూ టై ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా పోటీలో నిలిచింది. 19 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.  ఇదిలా ఉంటే..వర్షం కారణంగా అంపైర్లు ఓవర్లని రెండుసార్లు కుదించారు. 


వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.   ఆస్ట్రేలియా తొలి టీ20లో నెగ్గిన కంగారూ టీమ్ 1-0తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది.  భారత బౌలర్లలో భువనేశ్వర్, ఖలీల్ చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా, కుల్‌దీప్, కృనాల్ తలో వికెట్ తీశారు. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: