క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు..వింతలు వినోదాలు చూస్తూనే ఉంటాం.  బరిలోకి దిగిన క్రికెటర్లు ఏప్పుడు ఎలాంటి తమాషా చేస్తారో..ఎప్పుడు ఏ రికార్డ్ క్రియేట్ చేస్తారో అన్న ఉత్సాహంతో వీక్షిస్తుంటారు అభిమానులు.  తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20లో ఓ సెక్యూరిటీ గార్డు అందరికీ షాక్ ఇవ్వడమే కాదు అభిమానులను తనవైపునకు తిప్పుకునేలా చేశాడు.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 

 17వ ఓవర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని విరాట్ మిడ్ వికెట్ మీదుగా బలంగా బాదాడు.  అయితే ఆ బాల్ కాస్త బౌండరీ దాటి అవతల ఉన్న సెక్యూరిటీ గార్డు వైపునకు దూసుకు వెళ్లింది.
Image result for kohli ball catch security guard
అంతే మనోడే ఒక్కసారే బాల్ ని క్యాచ్ పట్టుకోవడంతో కెమెరాలన్నీ అతని వైపు తిరిగాయి. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా కరతాల ధ్వనులతో అతడిని అభినందించారు. కోహ్లీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డు ఆనందానికి హద్దే లేకుండా పోయింది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: