ప్రపంచంలో క్రికెట్ అంటే ఎంత అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ వస్తుందటే చాలు టివిలకు అతుక్కు పోతారు.  ఒక్కో బాల్ సిక్స్, ఫోర్లు కొడితే ఆటను తిలకించే వారి ఆనందాలు అంతా ఇంతా కాదు.  భారత దేశంలో క్రికెట్ అంటే ఎంతో అభిమానిస్తారు.  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవంలో కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ లో పర్యటించిన ధోనీ, అక్కడాడిన మెరుపు ఇన్నింగ్స్ ను ఎవరూ మరచిపోలేరని వ్యాఖ్యానించాడు. 
MS Dhoni scored 219 runs in his maiden ODI series in Pakistan in 2006 (Reuters Photo)
అయితే ధోని ఆట తీరు చూసి అభిమానులే కాదు ఏకంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ సైతం ముగ్ధుడై, ధోనీ గురించి తన వద్ద మాట్లాడారని చెప్పాడు.  ఆయన నా వద్దకు ప్రత్యేకంగా వచ్చి  'ఈ ధోని ఎక్కడ దొరికాడు మీకు?' అని అడిగారు.
where did you get ms dhoni pervez musharraf asks sourav ganguly
దానికి బదులుగా నేను, 'వాఘా సరిహద్దుల్లో తిరుగుతుంటే మేం మా దేశంలోకి లాక్కున్నాం' అంటూ సరదాగా అన్నాను.  ధోని ఆడుతుంటే..ముషారఫ్ వేదికపైనే ప్రశంసల వర్షం కురిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: