టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెటర్ కాక ముందు ఫుడ్ బాల్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే.  ఎప్పుడైతే క్రికెట్ ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించారో తన బ్యాటింగ్ తో అందరినీ మంత్ర ముగ్దులను చేశారు.  హెలికాఫ్టర్ షాట్స్ కొడుతూ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసేవారు.  అంచలంచెలుగా టీం ఇండియా  కెప్టెన్ ఎంఎస్ ధోనీ రేంజ్ కి ఎదిగారు. ఎంఎస్ ధోనీకి క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలపై కూడా ఎంతో ఆసక్తి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఇటీవలే ప్రో కబడ్డీ ప్రయోషన్స్ కోసం ధోనీ కబడ్డీ కూడా ఆడాడు. తాజా ఈ కెప్టెన్ కూల్ టెన్నీస్ రాకెట్ అందుకున్నాడు.  ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ-20 సిరీస్ లో స్థానం కోల్పోయిన తరువాత, ఎంఎస్ ధోనీ టెన్నిస్ రాకెట్ పట్టుకుని కాసేపు సందడి చేశాడు. తన హోమ్ టౌన్ రాంచీకి వచ్చిన ఆయన, జేఎస్సీఏ (జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్) అధీనంలోని స్టేడియంకు వచ్చాడు.

అంతేకాక.. పురుషుల డబుల్స్ విభాగంలో ధోనీ క్రీడాకారుడిగా ఆడాడు. సుమీత్ అనే టెన్నీస్ ప్లేయర్‌తో జతకట్టిన ధోనీ.. తొలి రౌండ్‌లో బ్రజేష్, పవన్‌ల జోడీని 6-1, 6-1 తేడాతో ఓడించాడు.  ధోనీ వచ్చాడని తెలుసుకున్న క్షణాల్లో అభిమానులు అక్కడ భారీగా చేరారు. వారంతా తమ అభిమాన ప్లేయర్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ధోనీ ఆటలకు ఎన్నడూ దూరం కాడని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: