ఒకప్పుడు భారత జాతీయ క్రీడ హాకీ అంటే ఎంతో ఆదరణ ఉండేది.  ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ జోరు అందుకుందో హాకీ ఆటకు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పొచ్చు.  హాకీ క్రీడకు పూర్వ వైభవం తెచ్చేందుకు  భారత్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్ హాకీ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ వరల్డ్‌కప్‌ ఆహ్వాన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

హాకీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌డం ఇది మూడ‌వ సారి. మొద‌టిసారి చైనా టీమ్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడ‌నున్న‌ది. 28 ఏళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ ఫ్రాన్స్ టోర్నీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించ‌నున్న‌ది. వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ కోసం ఒడిశా ప్ర‌భుత్వం సుమారు 100 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. తొలిసారిగా 1994లో ముంబాయి వేదికగా జరిగిన టోర్నీలో భారత్‌ ఐదోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2010 ఢిల్లీ వేదికగా ఎనిమిదోస్థానంతో సరిపెట్టుకుంది.

19 రోజుల పాటు జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 36 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఫూల్‌ఏలో అర్జెంటీనా, న్యూజిలాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌.. ఫూల్‌బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, చైనా.. ఫూల్‌సిలో బెల్జియం, భారత్‌, కెనడా, దక్షిణాఫ్రికా.. ఫూల్డిలో నెదర్లాండ్స్‌, జర్మనీ, మలేషియా, పాకిస్థాన్‌ ఉన్నాయి.   

ఈరోజు  ఆరంభోత్సవంలో సిని తారలు కనువిందు చేశారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహ్మాన్‌, మాధురీ దీక్షిత్‌ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: