భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌(8), హ్యారిస్‌(22) వికెట్లను కోల్పోయింది.ఫించ్‌ను ఔట్‌ చేసి ఇషాంత్‌ శర్మ భారత్‌కు  శుభారంభాన్ని అందించగా..  బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆస్ట్రేలియాను 151 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.  తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఏకంగా 292 పరుగుల ఆదిక్యం.
Australia Loss Five Wickets In Boxing Day Test Against India - Sakshi
ఫాలో ఆన్ అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్ కే భారత్ మొగ్గు.   క్రీజులోకి వచ్చిన ఉస్మాన్‌ ఖాజా (21), షాన్‌ మార్ష్‌ (19), ట్రావిస్‌ హెడ్‌(20), మిచెల్‌ మార్ష్‌ (9)లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్‌లో ఎవ‌రూ 25 ప‌రుగులు కూడా చేయ‌లేకపోవ‌డం గ‌మ‌నార్హం. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా మ‌రోసారి స‌త్తా చాటాడు. ఆరు కీల‌క వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

జ‌డేజా 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఇషాంత్, ష‌మీ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. భార‌త్ కంటే ఆస్ట్రేలియా 292 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.భార‌త ఓపెన‌ర్లు హ‌నుమ విహారి (0 నాటౌట్‌), మ‌యాంక్ అగ‌ర్వాల్ (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ స్కోరు 4/0.

భార‌త్ తొలి ఇన్నింగ్‌: 169.4 ఓవ‌ర్ల‌లో 443/7 (డిక్లేర్డ్‌)

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 66.5 ఓవ‌ర్ల‌లో 151 ఆలౌట్‌


మరింత సమాచారం తెలుసుకోండి: