మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.  అంతకుముందు నాలుగో రోజు 54/5 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ (33) ఔటైన తర్వాత కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.  రిషబ్ పంత్  అద్భుతమైన ఆట ప్రదర్శన మాత్రమే కాదు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను సైతం దెబ్బతీసేలా స్లెడ్జింగ్ కూడా చేస్తున్నాడు.

వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన ఆసీస్

తాజాగా, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. 399 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ అరోన్ ఫించ్ (3) ఔటయ్యాడు. జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు  మార్కస్ హ్యారిస్ (13)ను జడేజా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. 

Watch: Nostalgia? Pant does a Dhoni, again! Advises field placement as Indian skipper Kohli follows it

 ఓపెనర్ హారిస్ (13) స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు గాను ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మార్ష్ (25), ట్రావిస్ హెడ్ (15) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 306 పరుగులు చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: