భారత క్రికెట్ రంగంలో కోట్ల మంది అభిమానుల మనసు దోచిన గ్రేట్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానిస్తారు. అంత గొప్ప క్రికెటర్ ని టీమ్ ఇండియాకు అందజేసిన గురువు..సచిన్ టెండూల్కర్ ఎంతగానో గౌరవించి ప్రేమించే ఆయన గురువు  క్రికెట్‌లో ఓనమాలు దిద్దించిన ఆయన  ముంబైలో కన్నుమూశారు. 87 ఏళ్ల అచ్రేకర్ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డులు అందుకున్న రమాకాంత్ తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దిందీ సచిన్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. 
Related image
చిన్ననాడే సచిన్ లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి సరైన ట్రైనింగ్ ఇస్తూ చిన్నవయసులోనే గొప్ప క్రికెటర్ గా మలిచిన సత్తా అచ్రేకర్ కే సొంతం అని చెప్పాలి.  తన  విజయాలకు మూలం..తన గురువు గారే అని ఎన్నో పర్యాయాలు సచిన్ చెప్పారు. తాను క్రికెట్ నేర్చుకుంటున్నప్పుడు వివిధ టోర్నమెంట్ల కోసం అచ్రేకర్ స్కూటర్‌పై తనను తీసుకెళ్లేవారని సచిన్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అచ్రేకర్ ఇక లేరన్న విషయాన్ని ఆయన బంధువు రష్మి దల్వి తెలిపారు. తన గురువు ఇక లేరన్న విషయం తెలిసి సచిన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
Image result for sachin tendulkar teacher achrekar
అచ్రేకర్ మృతి పట్ల టీమ్ ఇండియా ఆటగాళ్లే కాదు...పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. సచిన్‌తోపాటు వినోద్ కాంబ్లి, ప్రవీణ్ ఆమ్రే, సమీద్ దిఘే, బల్విందర్ సింగ్ సంధు వంటి వారు కూడా అచ్రేకర్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు. అయితే, సచిన్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి, తన గురువు అచ్రేకర్‌కు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: