మాజీ టీమిండియా కెప్టెన్ ధోనీ రికారులని యువ క్రికెటర్ బ్రేక్ చేశాడు. తన అత్యున్నతమైన ప్రతిభతో క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. ధోనీ కూడా తన కెరియర్ ఆరంభంలో పాకిస్తాన్ పై సాధించిన సెంచరీని ఎవరు మర్చిపోలేరు. అయితే ఆ సమయంలో ధోనీ పాకిస్తానీ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు. అంతేకాదు పాకిస్థాన్ ధోనీ సాధించిన 148 లేక్కేసుకుంటే ఇప్పటి వరకూ విదేశాలలో అత్యధిక పరుగులు అవే కావడం విశేషం అయితే

 Image result for rishabh pant

తాజాగా సిడ్నీ టెస్టులో  ఆ రికార్డును యువ వికెట్ కీఫర్ రిషబ్ పంత్ తిరగ రాశాడు. తనదైన బ్యాటింగ్ తో దూసుకు వెళ్ళాడు. పంత్ చెలరేగి ఆడటం చూస్తే సీనియర్స్ ముక్కున వేలేసుకోవాల్సిందే అనేట్టుగా తన చూడ చక్కని ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సిడ్నీ టెస్ట్ లో ఆసిస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు సెంచరీ చేసేశాడు.

 Image result for rishabh pant

దాంతో ధోనీ పేరుతో ఉన్న అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు పంత్. ఇదే సిడ్ని టెస్టు సెంచరీ ద్వారా పంత్ మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు. అదేంటంటే ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత వికెట్ కీపర్ కూడా టెస్టుల్లో సెంచరీ సాధించలేదు కాని పంత్ ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ గా చరిత్రలో నిలిచి పోయాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: