ప్రస్తుతం టీమ్ ఇండియాలో యువ ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది.  ఆస్ట్రేలియాతోొ జరిగిన మ్యాచ్ లో యువ ఆటగాళ్ల క్రీడ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్న విషయ తెలిసిందే.  తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ గురించి చేసిన కామెంట్ సెన్సెషన్ గా మారింది.  ప్రపంచ కప్ జట్టులో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కడం అనుమానమేనంటున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇటీవల చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేశాడు. 

Rishabh Pant is not part of India squad for the ongoing ODI series in Australia and the upcoming limited-overs series in New Zealand (@BCCI Photo)

ఓ మీడియా సమావేశంలో సచిన్ మాట్లాడుతూ.. పంత్‌ను ప్రత్యేకంగా వికెట్ కీపర్ స్థానంలో జట్టులోకి తీసుకుంటుంది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే అలా చేయడానికి ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్‌కు కీపర్‌గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరించాడు.  రాబోయే ప్రపంచ కప్  జట్టులో రిషభ్‌ పంత్‌కు స్థానం కల్పిస్తే ఓ బ్యాట్స్‌మన్‌ను కానీ, బౌలర్‌ కానీ తీసేయాలి. ఇక్కడ రిషభ్‌ కోసం ఒక స్పెషలిస్టు బౌలర్‌ను తీయడమనేది సబబైన విషయం కాదు. 


ఇన్నింగ్స్ ఆరంభంలో ధోని కొన్ని బంతుల్ని వృథా చేస్తూ ఉంటాడు. పిచ్‌పై అవగాహన వచ్చే క్రమంలో ఇలా డాట్‌ బాల్స్‌ ఆడటానికి ఇష్టపడతాడు. తర్వాత గేమ్‌ను ఫినిషింగ్‌ చేసే విధానంలో మహీ శైలి విభిన్నంగా ఉంటుంది. ఇక దినేశ్‌ కార్తీక్‌ కూడా మంచి బ్యాట్స్‌మన్‌. మ్యాచ్‌పై ఒత్తిడిని తగ్గిస్తూ స్టైక్‌ రొటేట్‌ చేయడంలో కార్తీక్‌కు మంచి అనుభవం ఉంది. అందుకే రిషభ్‌ వరల్డ్‌కప్‌ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: