టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్‌ జట్టు భారత్‌కు 231 లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 48.4 ఓవర్లలోనే ‌230 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోహ్లీ సేన ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ ఆరు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్ వికెట్ల ప‌త‌నంలో కీల‌క పాత్ర పోషించాడు.టీమిండియా పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ ధాటికి ఓపెన‌ర్లు కారే (5), ఫించ్ (14) స్వ‌ల్ప స్కోర్లకే అవుట‌య్యారు. 27 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్ష్‌, ఖ‌వాజా ఆదుకున్నారు.


వీరిద్ద‌రూ మూడో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అనంత‌రం చాహల్ షో ప్రారంభ‌మైంది. చాహ‌ల్ ధాటికి ఖ‌వాజా (34), షాన్ మార్ష్ (39), హండ్స్‌కాంబ్ (58), స్టోయిన్స్ (10), రిచ‌ర్డ్స‌న్ (16), జంపా (8) పెవిలియ‌న్ చేరారు.


కెరీర్‌లో మొద‌టి సారి ఆరు వికెట్లు ద‌క్కించుకున్నాడు. మొత్తానికి ఈ వన్డేలో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరు వికెట్లు తీసి తన కెరీర్‌ బెస్టు నమోదు చేశాడు. భువనేశ్వర్‌, షమీ చెరో రెండు వికెట్లు తీశారు. 231 ప‌రుగులు చేస్తే టీమిండియా ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: