కోహ్లీసేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనూయ్‌లో మూడో వన్డే లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు.   

India vs New Zealand 3rd ODI Live

నెపియర్, మౌంట్ మాంగనూయ్‌లలో జరిగిన తొలి, రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకుని  సిరీస్‌ను ఇక్కడే దక్కించుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై భారత్ ముందు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.


కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రాహుల్ శర్మలు మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచి భారత్ విజయానికి బాటలు పరిచారు. ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (60), రోహిత్‌ శర్మ (62), అంబటి రాయుడు, దినేశ్‌  కార్తీక్‌ రాణించారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. మ్యాచ్ నుంచి ధోనీ అవుట్

Mon, Jan 28, 2019, 07:48 AM
  • తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీ
  • ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్
  • మళ్లీ జట్టులోకి వచ్చిన పాండ్యా
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనూయ్‌లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: