ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓపెనర్ దిముత్ క‌రుణ‌ర‌త్నే తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆసిస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ విసిరిన బౌన్సర్ కు శ్రీలంకకు క్రికెటర్ దిముత్ క‌రుణ‌ర‌త్నే తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్యాట్ క‌మ్మిన్స్ 142 వేగంతో విసిరిన బౌన్సర్ ను క‌రుణ‌ర‌త్నే తప్పించకునే క్రమంలో నేరుగా వెళ్లి అతడి మెడ‌ వెనక భాగంలో బ‌లంగా త‌గిలింది. దాంతో క్రీజులోనే కరుణరత్నె కుప్పకూలిపోయాడు. అయితే బంతి బలంగా తగలడం వల్లే క‌రుణ‌ర‌త్నేకి ప్రమాదం జరిగినట్లు గుర్తించిన వెంటనే సహాయక సిబ్బంది అతన్ని మైదానం నుంచి స్ట్రెచ‌ర్ వాహ‌నంపై బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారు.
karuna ratne struck at neck by ball
ప్రస్తుతం  క‌రుణ‌ర‌త్నేకు చికిత్స కొనసాగుతోంది. శ్రీలంక బ్యాట్ మెన్ కరుణ‌ర‌త్నే 46 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామని...ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు. హెల్మెట్ ధరించి వున్నా మరో క్రికెటర్ తీవ్రంగా గాయపడటంతో క్రికెటర్ రక్షణపై మరోసారి చర్చ ప్రారంభమయయ్యింది.
Karunaratne stretchered off after Cummins bouncer
గతంలో ఇదే ఆస్ట్రేలియా వేదికపై 2014లో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ కు బంతి తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 534/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: