కొన్ని సార్లు క్షణికావేశంలో చేసే పనులకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.  తాజాగా క్షణికావేశానికి గురై దాడికి పాల్పడిన అనూజ్ దేడాపై క్రికెట్ నుండి జీవితకాల నిషేదాన్ని విధించినట్లు డిసిసిఏ ప్రకటించింది.  ప్రస్తుత ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌, భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారిపై  అనూజ్‌ దేడా అనే యువ క్రికెటర్ తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్‌ను అమిత్ పరిశీలిస్తుండగా.. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్‌ చైన్లతో ఆయనపై దాడి చేశారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు,సైకిల్ చైన్లతో  దాడి చేయడంతో అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు.   
Anuj Dedha Banned for Life After Bhandari Assault
అయితే అమిత్ భండారిపై అనూజ్ దేడా అనే యువ క్రికెటర్ దాడి చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తనను డిల్లీ  అండర్-23 జట్టులో స్థానం కల్పించకపోవడంతో అనూజ్ తన స్నేహితులతో కలిసి అమిత్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.  వెంటనే   అనూజ్ దేడాతో పాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దాడిలో ఆయన తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. అనూజ్‌ దేడాను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

2000-2004 మధ్య రెండు వన్డేల్లో భారత జట్టుకు అమిత్ ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఇవాళ డిడిసీఏ సమావేశమయ్యింది. ఈ సమావేశానికి గంభీర్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అనూజ్ పై జీవిత కాల నిషేధాన్ని విధించాలని సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు.తోటి క్రికెటర్‌పై జరిగిన దాడిపై డిల్లీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండిచారు. ఈ దాడితో సంబంధమున్న ఆటగాళ్ళందరిని క్రికెట్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: