తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరం ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు వేధిక అయ్యింది.  ఈసారి క్రీడావేడుకలతో మురిపించనుంది. దేశంలో మొట్టమొదటి అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వరంలో మే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ పోటీలు సాగుతాయి. 

ఈ నేపథ్యంలో  మేలో ఫస్ట్ ఆలిండియా ఇంటర్ డిస్ట్రిక్ అండర్15 చాంపియన్‌షిప్ పోటీలను భాగ్యనగరంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి జగన్ మోహన్ రావు తెలిపారు.  ఈమేరకు హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్జ్‌లైవ్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను లక్నోలో విడుదల చేశారు.

పోటీల్లో టీస్పోర్ట్స్ సంస్థ కీలక పాత్ర పోషించనుంది. జూలైలో తాము తొలి ప్రో హ్యాండ్ బాల్ లీగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఏడుగురు భారతీయ, ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లతో కూడా 8 ఫ్రాంచైజీలను రూపొందిస్తున్నామని సంస్థ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: