కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని ద్రిగ్బంతి కి గురి చేసింది. దేశం మొత్తం ఇప్పటీకే ఈ దాడి పట్ల తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. అలాగే చాలా మదిని సెలెబ్రెటీస్ వీర మరణం పొందిన జవాన్లుకు తమ దైన సహాయాన్ని అందిస్తున్నారు. ఇండియన్ క్రికెటర్  సెహ్వాగ్  జవాన్ల  పిల్లల ను తానూ చదివిస్తానని ప్రకటించారు. దీనితో ఈ నిర్ణయం పట్ల సెహ్వాగ్ ను అందరూ అభినందిస్తున్నారు. 

Image result for sehwag

ఇంకా సెహ్వాగ్ ఏమన్నాడంటే దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్లకు మనం ఎంత చేసిన తక్కువే నని అన్నాడు. కనీసం వారి పిల్లల ను తన ఇంటర్ నేషనల్ స్కూల్ లో చదివిస్తానని ట్విట్టర్ లో తెలిపాడు. అలాగే ఒలింపిక్ మెడలిస్ట్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే అందరూ ముందుకు వచ్చి సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని పిలుపు ఇచ్చినాడు. 

Image result for pulwama terror

ఇంకా ట్విట్టర్ లో సెహ్వాగ్ ఏమన్నాడంటే దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్న జవాన్ల మరణం  నన్ను ఎంతో బాధించింది . భాదను వ్యక్త పరచడానికి మాటలు సరిపోవడం లేదు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సెహ్వాగ్ ప్రార్ధించాడు. అయితే ఇప్పటికే ఈ దాడి పట్ల ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా స్పదించాయి. అమెరికా అయితే పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇంత వరకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: