క్రికెట్ మైదానంతో ఆ ఆటగాడు అడుగు పెడితే..బౌలర్లకు ముచ్చెమటు పట్టించేలా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తాడు.  గ్రీస్ లోకి అడుగు పెడితే సెంచరీ లేదా హాఫ్ సెంచరీ అయితే కానీ రిలీఫ్ కాడు..అలాంటి  విధ్వంసకర క్రికెటర్ మరెవరో కాదు విండీస్  ఆటగాడు  క్రిస్ గేల్.  అలాంటి  క్రిస్ గేల్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అదివారం ప్రకటించాడు.

ఈ మెగా ఈవెంటే తన వన్డే కెరీర్‌లో చివరిదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న ఈ కరీబియన్ స్టార్.. ఊహించని విధంగా ఈ రిటైర్మెంట్ అంశాన్ని వెల్లడించాడు.  బోర్డుతో వివాదాల కారణంగా గేల్ ఇటీవల జాతీయ జట్టుకు ఆడడం బాగా తగ్గించేశాడు. గతేడాది జూలైలో చివరిసారిగా గేల్ వన్డే ఆడాడు. 
Image result for క్రిస్ గేల్
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. 20వ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న ఇద్దరిలో గేల్‌ ఒకడు.   విండీస్ తరఫున 284 వన్డేలు ఆడిన ఈ జమైకన్ 37.12 సగటుతో 9727 పరుగులు చేశాడు. ఇందులో 23 శతకాలు, 49 అర్ధసెంచరీలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: