అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు(488) సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 12 సిక్సర్లు బాది పట్టపగలే వారికి చుక్కలు చూపించాడు. 129 బంతుల్లో 135 పరుగులు చేశాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Image result for shahid afridi
ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌(398), శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య(352), టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (349), సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని (348)లు తరువాతి స్థానాలలో ఉన్నారు. ఇప్పటి వరకు అన్నీ పార్మాట్లలో కలిపి గేల్ మొత్తం 444 మ్యాచ్‌లు ఆడగా 488 సిక్సర్లు నమోదు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

476 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని వెనక్కి నెట్టేశాడు.  మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే.. గేల్ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, టీ20ల్లో 103 సిక్సర్లు కొట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: