మర్చి 23 నుంచి అంగరంగ వైభవంగా మొదలు కావాల్సిన ఐపీఎల్ ఉత్సవాలు రద్దు చేశారు.ఐపీఎల్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Image result for ipl opening ceremony 2019

ఈ మేరకు ఇప్పటికే 14 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ మూడు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభోత్సవానికి బదులుగా ఆ డబ్బుని పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి అందజేయాలని బీసీసీఐ పాలకుల కమిటీ ఈరోజు నిర్ణయించింది. వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్‌కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు.

Image result for ipl opening ceremony 2019

దీనిపై ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. 2018 ఐపీఎల్ సీజన్ ఆరంభోత్సవానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బడ్జెట్‌లో రూ.50 కోట్లను తొలుత కేటాయించగా.. ఆ మొత్తాన్ని రూ.30 కోట్లకి బీసీసీఐ పాలకుల కమిటీ తగ్గించింది. గత ఏడాది రూ.20 కోట్లు కోత విధించడంపై బీసీసీఐ పెద్దలు బాహాటంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: