కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రీడా రంగానికి తనదైన తోడ్పాటు ను అందిస్తుంది. ఇప్పటికే గ్రామీణా యువకుల్లో ఉన్న ప్రతిభ ను వెలికి తీయడానికి పలు పథకాలను ప్రవేశ పెట్టింది. ఒలింపిక్స్ లో కూడా మనోళ్లు సత్తా చాటుతుండటంతో ఆ దిశగా భారత్ ఇప్పుడు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్ లో స్పోర్ట్స్ కు సంబంధించి ఫిట్నెస్, క్రీడా విశేషాలు అన్ని అందుబాటులో ఉంటాయి. 

Image result for narendra modi

ముఖ్యంగా యువకుల్లో  దాగి ఉన్న ప్రతిభాను వెలికి తీయడం లో ఈ యాప్ ఉపయోగపడుతుంది. క్రీడల్లో ఆసక్తి ఉండే యువకుల డేటా మొత్తం ఇందులో పొందుపరిచి ఉంటుంది. యువకుల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించడానికి , వారికి సరైన అవకాశాలు, సపోర్ట్ గా నిలవటానికి ఈ యాప్ ప్రభుత్వానికి ఎంతో గానో ఉపయోగపడుతుంది. 

PM Modi launches Khelo India app - Watch Video

ఇప్పటికే ప్రభుత్వం క్రీడల్లో చెప్పుకోదగ్గ ఫండ్స్ ను ఖర్చు చేస్తుంది. అయితే మన దేశం లో యువకుల జనాభా ఎక్కువ కాబట్టి ఈ ఫండ్స్ ను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మన కంటే చిన్న దేశాలు ఒలిపింక్స్ పథకాల పంట పండిస్తుంటే ఇండియా మాత్రం ఇంకా వెనుకనే ఉంది. పట్టుమని పది కూడా పథకాలను సంపాదించలేని పరిస్థితిలో ఉందని చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచింది ఫండ్స్ పెంచాలని ఆశిద్దాము. 



మరింత సమాచారం తెలుసుకోండి: